టీయూడబ్ల్యూజే (ఐజేయు) నియోజవర్గ ప్రధాన కార్యదర్శి ముడుపు శ్యాంసుందర్ రెడ్డి…
మునుగోడు జులై 6 ( TODAY9):-
జర్నలిస్టు కుటుంబ సభ్యుల పిల్లలకు ఫీజు రాయితీ సర్కులర్ ను తక్షణమే జారీ చేయాలనీ టీయూడబ్ల్యూజే
(ఐజేయు) నియోజవర్గ ప్రధాన కార్యదర్శి ముడుపు శ్యాంసుందర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
టీయూడబ్ల్యూజే(ఐజేయు) జిల్లా కమిటీ ఆదేశానుసారం నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టు కుటుంబ సభ్యుల పిల్లలకు ఫీజు రాయితీ సర్కులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మునుగోడు మండల కేంద్రంలోనీ విద్య శాఖ కార్యాలయం వద్ద జర్నలిస్టులు నల్ల రిబ్బన్ లతో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన టీయూడబ్ల్యూజే(ఐజేయు) జిల్లా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కుంభం ఇంద్రసేనారెడ్డితో కలిసి మండల విద్యాధికారి తలమల్ల మల్లేశంకు వినతి పత్రం అందజేశారు.
టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కమిటీ గత నెల 5న నల్లగొండ డిఇఓ, కలెక్టర్ కి జర్నలిస్టు కుటుంబ సభ్యుల పిల్లలకు పాఠశాల విద్యలో ఫీజు రాయితీ కోసం వినతి పత్రాలు సమర్పించడం జరిగిందన్నారు.స్కూల్ ప్రారంభం అయి నెల రోజులు కావస్తున్నప్పటికిని విద్యాశాఖ సర్కులర్ జారీ చేయకుండా నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదన్నారు.
ఇతర జిల్లాలలో ఇప్పటికే ఫీజు రాయితీ సర్కులర్ జారీ చేసినందున తక్షణమే నల్గొండ జిల్లాలో కూడా సర్కులర్ జారీ చేసి పేద కుటుంబాల జర్నలిస్టుల పిల్లలు విద్యకు దూరం కాకుండా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే(ఐజేయు) నియోజవర్గ ఉపాధ్యక్షుడు జాజుల స్వామి,సహాయ కార్యదర్శి దొమ్మాటి కృష్ణ,జర్నలిస్టులు
మార్నేని ప్రభాకర్,నెల్లికంటి శంకర్,బేరీ లింగస్వామి,పెరుమాళ్ళ ప్రమోద్ కుమార్,దుబ్బ విజయ భాస్కర్,జీడిమడ్ల నరేష్,దుబ్బ అనిల్ , విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.









