ప్రగతి పథం దిశగా మధిర

రూ.17.48 కోట్లతో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు

•బోనకల్ మండలంలో అభివృద్ధి పనుల జాతర..

•మౌలిక వసతుల కల్పనే ధ్యేయమన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మధిర నియోజకవర్గ రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించి, సుమారు రూ. 17.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు కీలక రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల అనుసంధానానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.

మండలంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు కనెక్టివిటీ సమస్యలను పరిష్కరిస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభమైన పనుల వివరాలు ఇలా ఉన్నాయి:
చిరునోముల – వత్సవాయి రహదారి: రూ. 3.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ రహదారి పనులకు ఈరోజు ఉప ముఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించారు .

ముష్టికుంట్ల – గార్లపాడు రోడ్డు: రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు రూ. 5.50 కోట్ల వ్యయంతో ఈ రహదారిని నిర్మించనున్నారు.

ముష్టికుంట్ల ఎస్సీ కాలనీ అంతర్గత రోడ్లు: దళితవాడల అభివృద్ధిలో భాగంగా ముష్టికుంట్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో రూ. 73 లక్షలతో అంతర్గత రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ముష్టికుంట్ల పరిధిలోని బోనకల్ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి చిరునోముల వరకు రూ. 3.30 కోట్ల అంచనా వ్యయంతో నూతన బీటీ రోడ్డు పనులను డిప్యూటీ సీఎం ప్రారంభించారు.

ముష్టికుంట్ల – చొప్పకట్లపాలెం రహదారి: ముష్టికుంట్ల నుంచి నాగులవంచ మీదుగా చొప్పకట్లపాలెం వరకు రూ. 4.75 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రహదారి పనులకు డిప్యూటీ సీఎం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. అందులో భాగంగానే నిధులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం రాకతో బోనకల్ మండలంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులతో మధిర నియోజకవర్గం రాష్ట్రానికే తలమానికం కానున్నదని ప్రజలు భావిస్తున్నారు…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు