పాఠశాలల కుదింపు ఆలోచన విరమించుకోవాలి..

భద్రాచలం కేజీబీవీ పాఠశాలలోనాన్ టీచింగ్ స్టాప్ ను నియమించాలి

•పిఆర్సి రిపోర్ట్ తెప్పించుకుని ఫిట్మెంట్తో పిఆర్సి అమలు చేయాలి

భద్రాచలం జులై 23 : TODAY 9 ప్రతినిధి

.

కస్తూర్భాగాంధీ పాఠశాల ఉపాధ్యాయ సంఘం భద్రాచలం మండల కమిటీ ఆధ్వర్యంలో విస్తృతంగా కే జీ వీ బీ పాఠశాలలో . సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా మండలంలో ఉన్న అన్ని పాఠశాలలను సందర్శించి సభ్యత్వ నమోదు చేశారు

ఈ సందర్భంగా కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులను ఉద్దేశించి జిల్లా కార్యదర్శి S. విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎస్ఎస్ఏ సమ్మె కాలానికి సంబంధించి శాలరీ తక్షణమే చెల్లించాలని, పాఠశాలలో రెండు సంవత్సరాల నుండి ఖాళీగా ఉన్న ఏఎన్ఎం అకౌంటెంట్ స్కావెంజర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ లేక పాఠశాల విద్యార్థినులు ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే ఉన్నతాధికారులు నాన్ టీచింగ్ స్టాఫ్ నియమించాలని డిమాండ్ చేశారు , అలాగే కేజీబీవీ ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలని డిమాండ్ చేయడం జరిగింది. కేజీబీవీ. ఆశ్రమ పాఠశాల పనిచేస్తున్న కాంటాక్ట్ ఉపాధ్యాయులకుమే నెల జీతాన్ని వెంటనే చెల్లించాలని కోరారు

ఇది ఇలా ఉండగా 27 వేల ఉపాధ్యాయులు సంఖ్యను 4,000 కుదించాలనే ప్రభుత్వాలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పిఆర్సి కమిటీ నివేదికను తెప్పించుకొని సరైన ఫిట్మెంట్ తో ప్రకటించాలని.బకాయి పడ్డ ఐదు డిఏలను వెంటనే ప్రకటించాలని,అందుకు తగ్గట్టుగా విధివిధానాలను ప్రకటించి హెల్త్ కార్డులను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఎస్ టి ఎఫ్ ఐ. యుటిఎఫ్ ఆధ్వర్యంలో25వ తారీఖున జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమం లో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొనాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొమరం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ బాబు, కోశాధికారి ఆశాలత, కార్యదర్శి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share