విజయ్‌ సీఎం అయినందుకు నాకు అసూయ లేదు..

కమల్‌హాసన్‌ సీఎం అయితే అసూయపడతానేమో.. రజనీ కాంత్..

తమిళ నాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఎన్నికై నందుకు తనకు ఎటువంటి అసూయ లేదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు.అదే తన తరానికి చెందిన మరో నటుడు కమల్ హాసన్ కనుక సీఎం అయి ఉంటే అసూయ పడే వాడినేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రజనీ కాంత్.విజయ్‌ సీఎం అయ్యాడనే విషయం తెలిసి మొదట షాకయ్యానని.. సింగిల్‌గా పోటీచేసి రెండు పెద్ద పార్టీలపై గెలిచాడు,తమిళనాడు ప్రజలకు విజయ్‌ మంచి చేస్తాడనే నమ్మకం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు రజనీ కాంత్.

ఇది ఇలా ఉంటే తనతో విజయ్‌ను పోల్చడం తప్పు అన్నారు.. విజయ్‌కు, తనకు 28 ఏళ్ల వ్యత్యాసం ఉందని ,తాను ఇక రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు.. స్టాలిన్‌ తనకు మంచి మిత్రుడని.. అందుకే ఓడిపోయిన తర్వాత కలిశానన్నారు రజనీకాంత్‌. నేను రాజకీయాల్లో లేనప్పుడు విజయ్ మీద నాకు ఎందుకు అసూయ ఉంటుందని, ఒకవేళ కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయి ఉంటే నాకు అసూయ వచ్చి ఉండేదేమో తెలీదు..అప్పుడు కూడా వచ్చి ఉండదు అన్నారు.నన్ను విజయ్ తో పోల్చుకుంటే అది నాకు మంచిది కాదు.. విజయ్ ని నాతో పోల్చుకుంటే అది ఆయనకు మంచిది కాదు. విజయ్ CM అయినందుకు నాకు ఎందుకు అసూయ ఉంటుంది అని అన్నాడు రజనీకాంత్.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు