భద్రాద్రి కొత్త గూడెం :జిల్లా బ్యూరో. మే 9 టుడే 9 ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య ఆధ్వర్యంలో పాల్వంచ కొత్తగూడెం టీజీఎఫ్డీసీ డివిజన్లలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ నిబద్దతను చాటుతూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం ఆవిర్భావ దినోత్సవ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని కార్పొరేషన్ సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొని సిబ్బంది అందరూ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రక్తదానం కార్యక్రమం నిర్వహించారు పాల్గొన్న వారందరినీ చైర్మన్ అభినందించారు.కార్పొరేషన్ లో ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిన వారిని ఈ సందర్భంగా సన్మానించారు..

చైర్మన్ పొదెం వీరయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలు, అంకితభావంతో పనిచేస్తున్న సిబ్బంది సమిష్టి కృషి వల్లనే సంస్థ ఈరోజు లాభాలను ఆర్జిస్తూ ప్రజల మన్ననలు పొందుతోందని తెలిపారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో కార్పొరేషన్ ముందడుగులో కొనసాగుతూ రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా దోహదపడుతోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో పాల్వంచ కొత్తగూడెం డి యం లు, పాల్వంచ ఎఫ్ డి ఓ కార్పొరేషన్ డివిజన్ లలో అన్ని విభాగల సిబ్బంది, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.









