భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న మంత్రి తుమ్మల.

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో:. మే 14
టుడే 9 ప్రతినిధి

భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు రామయ్య దర్శనానికి విచ్చేసిన మంత్రి తుమ్మలకు ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చకులు. పూర్ణకుంభంతో ప్రత్యేక ఆహ్వానం పలికారు..మంత్రిగా తొలిసారి ఎన్టీఆర్ క్యాబినెట్ లో ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా నలభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు మంత్రి తుమ్మల ,1986 మే 14 తేదీన తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం గమనార్హం..

ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం దేవస్థానం ఈవో మంత్రికి స్వామివారి శేష వస్త్రాన్ని బహుకరించి సీతారామచంద్రస్వామి ప్రతిమను అందించారు.

మంత్రి తుమ్మలతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ,ఖమ్మం సుడా చెర్మన్ పువ్వాడ దుర్గాప్రసాద్. తదితరులు పాల్గొన్నారు..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు