భద్రద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో: భద్రాచలం మే 9
టుడే 9 ప్రతినిధి
దైవ దర్శనానికి భద్రాచలం వచ్చిన ఒక భక్తుడు పొరపాటున తన చేతికి ఉన్న బ్రాస్లెట్లు చేజార్చుకోగా ఆ బ్రాస్లెట్ దర్శనానికి విచ్చేసిన భక్తులకు దొరికింది అయితే దానిని వెంటనే వెంకటేశ్వర్లు అనే భక్తుడు దానిని దేవస్థానం అధికారులకు అప్పగించిన సంఘటన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే, శనివారం రామయ్య దర్శనానికి రాజమండ్రి నుంచి వచ్చిన వీర బ్రహ్మానంద స్వామి అనే భక్తుడు పోగొట్టుకున్న బంగారు బ్రాస్లెట్ ను ఆయనకు దేవస్థానం అధికారులు తిరిగి అందజేశారు.

రామాలయ దర్శనం సమయంలో బంగారు బ్రాస్లెట్ ను రాజమండ్రి కి చెందిన ఆ భక్తుడు పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో కొత్త గూడెం కి చెందిన వెంకటేశ్వర్లు అనే భక్తుడికి ఆ బంగారం దొరకగా భద్రాచలం కు చెందిన జి వెంకటేశ్వరరావు సహకారంతో దేవస్థానం అధికారులకు ఆ బ్రాస్లెట్ అందజేశారు. ఈ క్రమంలో బ్రాస్లెట్ ను పోగొట్టుకున్న వీర బ్రహ్మానంద స్వామికి ఆ ఇరువురి సమక్షంలో ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబా. యస్ పి ఎఫ్ సిబ్బంది ద్వారా పోగొట్టుకున్న వారికి అందజేశారు. వీర బ్రహ్మానంద స్వామి కి అందజేసిన బంగారు బ్రాస్లెట్ విలువ రూ.మూడున్నర లక్షలు ఉండటం విశేషం. వీర బ్రహ్మానంద స్వామి పోగొట్టు కోగా దొరికిన బంగారు బ్రాస్లెట్ ను ఆయనకు అందజేసిన వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరావును దేవస్థానం అధికారులు అభినందించారు.









