ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ మృణల్ శ్రేష్ట….

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో: భద్రాచలం- మే 6
టుడే 9 ప్రతినిధి

ఆదివాసి గిరిజన గ్రామాలలో నివసిస్తున్న గిరిజనులకు వేసవిని దృష్టిలో పెట్టుకొని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని సరైన వైద్య సేవలు అందించాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట సంబంధిత వైద్య సిబ్బందికి సూచించారు. బుధవారం నాడు భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వివిధ వ్యాధులతో చికిత్స పొందుతున్న జనరల్ వార్డ్, మెటర్నిటీ వార్డ్, పీడియాట్రిక్ వార్డు, ఎమర్జెన్సీ వార్డులను పరిశీలించి మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, రోగులకు అవసరమైన వైద్య సదుపాయాలు, సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అటెండెన్స్ రిజిస్టర్లు, ఓపీ రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్లను సబ్ కలెక్టర్ తనిఖీ చేసి, విధుల్లో ఉన్న మెడికల్ ఆఫీసర్‌తో పాటు ఇతర సిబ్బంది హాజరును కూడా పరిశీలించారు. ఏరియా ఆసుపత్రికి వచ్చిన రోగులతో సబ్ కలెక్టర్ కలెక్టర్ నేరుగా మాట్లాడి, వారికి అవసరమైన మందులు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు. ఎండలు ముదురుతున్నందున ప్రజలు ఎక్కువ శాతం వడదెబ్బకు గురి అయ్యే అవకాశం ఉన్నందున బయటకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే జ్వరం, జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రోగులకు సూచించారు.
ఏరియా ఆసుపత్రిలో మందుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, అన్ని రకాల అవసరమైన మందులు, వ్యాక్సిన్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. అదేవిధంగా ఆసుపత్రి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, వైద్యులు రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ వైద్యులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు