ఐటిడిఎ పీఓ పై గిరిజన యువకుడి అచంచల అభిమానం.
•భద్రాచలం ఐటీడీఏ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం. ఒక అధికారి పట్ల ప్రజలకు ఉండే కృతజ్ఞత సరిహద్దులు దాటి, సముద్ర మట్టానికి వేల మీటర్ల ఎత్తున ఉన్న ప్రపంచ శిఖరాగ్రానికి చేరుకుంది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో: భద్రాచలం: మే 2
టుడే 9 ప్రతినిధి…
భద్రాచలం ఐటీడీఏ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం. ఒక అధికారి పట్ల ప్రజలకు ఉండే కృతజ్ఞత సరిహద్దులు దాటి, సముద్ర మట్టానికి వేల మీటర్ల ఎత్తున ఉన్న ప్రపంచ శిఖరాగ్రానికి చేరుకుంది పెనుబల్లి మండలం వి.ఎం బంజర్ గ్రామానికి చెందిన బి. మోతీ కుమార్ అనే గిరిజన యువకుడు గతంలో మౌంట్ కిలి మంజరో పర్వతం 5 8 9 5 మీటర్లు, మౌంట్ ఎలబ్రస్ పర్వతం 5642 మీటర్లు అధిరోహించి రావడం జరిగిందని, ప్రస్తుతం ఎవరెస్ట్ శిఖరం సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్‌కు వరకు వెళ్లి వచ్చాడు, త్వరలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించబోతున్నాడు. దీనికి అతను, దాతల సహకారం కోరుతున్నాడు.
హిమ శిఖరాల నుండి వీడియో సందేశం.
మోతీ కుమార్ ఎవరెస్ట్ మంచు కొండల నుండి పంపిన సందేశం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.”సార్, గిరిజనుల సంక్షేమం కోసం మీరు పడుతున్న కష్టానికి ప్రతిఫలంగా, మీపై ఉన్న అభిమానంతో ఈ ఫ్లెక్సీని తీసుకొని వచ్చాను ధన్యవాదాలు అని ఆ యువకుడు సందేశం పంపించడం జరిగింది.ఒక ఐఏఎస్ అధికారి పట్ల గిరిజన యువతకు ఉన్న ఈ అచంచలమైన ప్రేమాభిమానాలు, ప్రజా సేవకు పారదర్శకమైన పాలన తోడైతే ఎలాంటి ఫలితాలు ఉంటాయో అనడానికి నిదర్శనం,ప్రజల నుండి ఏ అధికారికైనా అభిమానంతో కూడిన గౌరవం లభించడం మనం చూస్తుంటాం కానీ గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఐటీడీఏ పీవో బి రాహుల్ కి దేశంలోనే మొట్టమొదటిసారి ఇంతటి అరుదైన గౌరవం దక్కడం విశేషం.
ఇది పీఓ రాహుల్ ‘స్వర్ణ యుగం అంటున్న గిరిజనులు
గిరిజన ప్రాంత అభివృద్ధిలో పీఓ రాహుల్ రెండేళ్ల లోపు పాలన ఒక అద్భుతమైన మార్పును తెచ్చింది. గిరిజన సంస్కృతిని భద్రపరిచేందుకు అత్యాధునిక గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయటం, గిరిజన ఉత్పత్తుల కోసం ‘భద్రగిరి మార్ట్ ‘సృష్టించి, వారిని వ్యాపారులుగా మార్చడం, విద్య, వైద్యం, సాగు తాగునీటి సౌకర్యాల కల్పనలో విప్లవాత్మక మార్పులు చేశారు.ఆదివాసీ జేఏసీ ద్వారా ‘ఆదివాసి వికాస రత్న”బిరుదు పొందారు.









