మే 3 న భద్రాద్రి వేదికగా భారీహిందూ సమ్మేళన సభకు సర్వం సిద్ధం

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భద్రాచలంలో భారీ హిందూ సమ్మేళన సభ మే మూడో తారీఖున స్థానిక కాలేజీ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహకులు పాకాల దుర్గాప్రసాద్. విలేకరుల సమావేశం లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప లోపల కులం. గడప దాటితే మనమంతా హిందువులం. అనే నినాదంతో ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు

సమాజంలో ఉన్న భేదాలను పక్కన బెట్టి ఐక్యంగా నిలబడే సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అనిఅన్నా రు. గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఈ సమ్మేళనం చరిత్రంగా నిలవాలని ఆకాంక్షించారు. కులాలు మతాలు వృత్తులు ఏవైనా మనమందరం హిందువులమే అని సాటి చెప్పటానికి ఒక వేదిక మీదకు రావాలని నిర్వాహకులు ఈసభ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరుణాచలం నాగ స్వామి. ఎం ఈ సుబ్రహ్మణ్యం. నాగభూషణ శాస్త్రి. కుంజా సంతోష్. గోపి. కిషోర్.ఎం శ్రీనివాసరెడ్డి.సిద్ధార్థ. సంజయ్. తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share