భూ వివాదంతో మువ్వా విజయబాబుకు ఎటువంటి సంబంధం లేదు: కాంగ్రెస్ నాయకులు


దమ్మపేట, జూలై 5 (TODAY9):

నల్లగుంట గ్రామంలోని సర్వే నం. 273/1 భూ వివాదానికి తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబుకు ఎలాంటి సంబంధం లేదని మండల కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. ఆయనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఖండించారు.
వినాయక ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కక్కిరాల రమేష్, ఐఎన్‌టీయూసీ మండల అధ్యక్షుడు రొయ్యల కుమార్ మాట్లాడుతూ, ఈ భూ వివాదం 2009 నుంచే కొనసాగుతోందని, రాజకీయ ప్రయోజనాల కోసం మువ్వా విజయబాబు పేరును లాగడం సరికాదన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమాన సంఘం నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు