మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మధిర ఇన్స్పెక్టర్ రమేష్ పిలుపునిచ్చారు.
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
విద్యార్థులకు మత్తు పదార్థాల వలన కలిగే శారీరక, మానసిక దుష్ప్రభావాలు, అలాగే ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం ఉండే చట్టపరమైన శిక్షలు గురించి క్లుప్తంగా విద్యార్థులకు క్షుణ్ణంగా వివరిస్తూ…. చెడు స్నేహితుల ప్రభావం, సామాజిక ఒత్తిళ్లు డ్రగ్స్ వైపు తీసుకెళ్లే విధానంపై విద్యార్థులకు మార్గదర్శనం ఇవ్వడం జరిగింది. మాదక ద్రవ్యాల వినియోగం విద్య, భవిష్యత్ కెరీర్, కుటుంబంపై కలిగించే ప్రతికూల ప్రభావాలను ఈ సందర్బంగా ఇన్స్పెక్టర్ వివరించారు.









