బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్
కొత్తగూడెం , జూన్ 24: (Today 9) పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక ఫీజుల భారం మోపుతున్నాయని బీజేపీ పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దిశగా జిల్లా విద్యాశాఖ అధికారి వినతిపత్రం సమర్పించారు.

విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రుల నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఈవోని కోరారు. పలు ప్రైవేట్ పాఠశాలల్లో ఫిట్నెస్ లేని పాఠశాల బస్సులు నడుస్తున్నాయని, అవసరమైన అనుమతులు లేకుండానే రవాణా సేవలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా అనేక పాఠశాలల్లో ఫైర్ సేఫ్టీ (అగ్నిమాపక) అనుమతులు లేకపోవడం, విద్యార్థులకు ఆటస్థలాలు (ప్లేగ్రౌండ్స్) లేకపోయినా అనుమతులు పొందడం వంటి అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. విద్యార్థుల భద్రత, నాణ్యమైన విద్య మరియు తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ కోసం బీజేపీ ఎల్లప్పుడూ పోరాడుతుందని శీలం విద్యాసాగర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి కలంకార్ రాజశేఖర్, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు , అలివేలు, పట్టణ కార్యదర్శి సుహాసిని మరియు మహిళా మోర్చా అధ్యక్షులు యామిని, ఎస్టి మోర్చా అధ్యక్షులు భూక్యా పూర్ణ, ఎస్సీ మోర్చా అధ్యక్షులు హృదయ్, బీజేపీ జిల్లా నాయకులు నోముల రమేష్, ఆది మూల రాములు, రాయుడు నాగేశ్వరరావు, రాజమౌళి కార్యకర్తలు ఉమామహేశ్వరరావు భాస్కర్ గౌడ్, జగదీష్, రవి శంకర్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.









