•ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి.
•వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజా నరసింహ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జులై 24
Today 9 ప్రతి నిధి…
ఆదివాసి గిరిజన గ్రామాలలో మౌలిక వసతులతో పాటు ఆరోగ్య సేవలు విస్తృతంగా అందించవలసిన బాధ్యత సంబంధిత వైద్య అధికారులపై ఉందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గిరిజనులకు మరింత వైద్య సేవలు అందేలా చూడాలని అందుకు కావలసిన వసతుల గురించి ప్రణాళికలు రూపొందించి తనకు సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ అన్నారు.

బుధవారం నాడు హైదరాబాదులోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ భవనం జూబ్లీహిల్స్ లో జరిగిన వర్క్ షాప్ లో ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ జెడ్ చెంగుతూ తో కలిసి ఒకరోజు జరిగిన వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంత ఆదివాసి గిరిజన గ్రామాలలోని కుటుంబాలకు సీజనలను బట్టి వచ్చే వ్యాధులే కాకుండా ప్రాణాంతకమైన క్యాన్సర్ మరియు కిడ్నీ సమస్యలు. ఇతర డిసిజన్ల నుండి గిరిజనులకు అవగాహన కల్పించి సరియైన వైద్య సేవలు అందించడానికి కావలసిన ప్రతిపాదనలు రూపొందించి పంపించాలని అన్నారు. అలాగే ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో పనిచేసే డాక్టర్లకు ప్రత్యేక అలవెన్స్లతో పాటు వారికి కార్పోరేస్ ఫండ్ అందిస్తామని గిరిజనులకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందించాలని అన్నారు.
ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో బి రాహుల్ మాట్లాడుతూ గిరిజన గ్రామాలలో గిరిజనులకు సరైన వైద్య సదుపాయాలు అందించడానికి భద్రాచలం ఐటిడిఏ ఏజెన్సీ ఏరియా పరిధిలో డాక్టర్ల కొరత ఉందని అలాగే పిహెచ్సి ల నిర్మాణం కూడా చేపట్టాలని దానితోపాటు అన్నిపీహెచ్సీలలో వివిధ రకాల ఎక్కువ మెంట్స్ తోపాటు మౌలిక వసతుల కల్పన కల్పించాలని దాదాపు 20 కోట్ల వరకు రూపాయలు అవసరం ఉన్నదని అన్నారు.
అనంతరం మహిళలు రైతులకు ఆర్థికంగా చేయూత అందించడానికి ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రారంభించిన భద్రగిరి మార్ట్ గురించి వర్క్ షాప్ లో పాల్గొన్న మంత్రివర్యులకు, ప్రిన్సిపాల్ సెక్రటరీ, పిఓలకు. ఇతర అధికారులకు వివరించారు.
భద్రగిరి మార్ట్ కి సంబంధించిన నిత్యవసర సరుకులను మంత్రి. వైద్య ఆరోగ్యశాఖ సెక్రటరీలకు అందించిన అనంతరం వారు మాట్లాడుతూ గిరిజన మహిళలకు రైతులకు ఆర్థికంగా చేయూత అందించడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 70 ఎస్ఎస్సి గ్రూపు మహిళలు ఆదివాసి గిరిజన మహిళలు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుకొని తయారుచేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఇప్పపువ్వు లడ్లు, వివిధ రకాల పచ్చళ్ళు, తృణధాన్యాలు, గిరిజన రైతుల నుండి సేకరిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులు. జిసిసి అటవీ ఉత్పత్తులతో పాటు అడవులలో నివసించే ఆదివాసి గిరిజన మహిళలు, రైతులు, ఎస్ సి హెచ్ జి గ్రూప్ మహిళలు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకొని మార్కెట్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న వాస్తవాలను గమనించి వారు ఆర్థికంగా బలోపేతం కావడానికి భద్రాచలంలో భద్రగిరి మార్ట్ నెలకొల్పి వారు తయారు చేసిన నిత్యవసర సరుకులను మధ్య దళారుల పాలు కాకుండా కొనుగోలు చేసి వారికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించిన ఐటీడీఏ పీవో బి రాహుల్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన అన్నారు.

ఐటీడీఏ పీవో గిరిజన సంక్షేమానికి పాటుపడుతున్న విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన గ్రామాలలో గిరిజనుల కోసం పనిచేస్తున్న అధికారులు అమలు చేస్తే గిరిజనులు ఆర్థికంగా బలోపేతమై వారి కుటుంబాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోషించుకుంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ సెక్రెటరీ సర్వేశ్వరరావు ,సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఏడిఎంహెచ్వో సైదులు . వివిధ ఐటీడీఏ ల నుంచి వచ్చిన ఏపీవోలు, డిఎంహెచ్వోలు ఇతర విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 16









