మూడ విశ్వాసాల దుశ్చర్యలను ఖండించిన సిపిఐ ఎం.

భద్రాచలంజులై 22 TODAY 9 ప్రతినిధి

రెండు నెలల వ్యవధి లోనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందితే సానుభూతి చూపించాల్సింది పోయి మృతదేహాలను ఇంటికి తీసుకురావద్దు అంటూ హుకుం జారీ చేసి ఇంటి ప్రధాన గేటు కి తాళం వేసిన ఇంటి యజమాని వైఖరిపై సిపిఐఎం తీవ్రంగా మండిపడింది. ఈ మేరకు సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎమ్ బి నర్సారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు పట్టణ కమిటీ సభ్యులు నకిరేకంటి నాగరాజు స్థానిక ప్రజల ద్వారా ఇంటి యజమానితో చరవాణిలో మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికి సదురు యజమాని వినకపోవడంతో తనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎం బి నర్సారెడ్డి మాట్లాడుతూ సైన్స్ ఎంతో పురోగతి చెందుతున్న ఈ రోజుల్లో మృతదేహాల సెంటిమెంట్ పేరుతో ఇంట్లోకి రానికపోవడం దుర్మార్గమని అన్నారు. ఇటువంటి ఘటనలు ఇటీవల పెరిగిపోవటం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. జీవించి ఉన్నప్పుడు ఒకే కుటుంబ సభ్యులాగా కలిసి ఉండే ఇంటి యజమాని దుదుష్టశాత్తు అద్దెకు ఉన్నవారు మరణిస్తే మైల పేరుతో దూరం పెట్టడం మానవ సంబంధాలకే ప్రమాదమని అన్నారు. దూడల సాయి ప్రకాష్ కుటుంబానికి సిపిఎం ఎప్పుడు అండగా ఉంటుందని అవసరమైతే వారి మృతదేహాలను ప్రజల సందర్శనార్థం సిపిఐఎం కార్యాలయంలో ఉంచడానికి ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. మూడ విశ్వాసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్వచ్చంద సంస్థలు సెమినార్లు సదస్సులు నిర్వహించాలని కోరారు. మరొక 15 రోజుల్లోనే తండ్రి ఉద్యోగం పొందనుండా దూడల సాయి ప్రకాష్ కుటుంబం రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం అత్యంత బాధాకరమని ఆ కుటుంబానికి సిపిఐ ఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుందని అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు