*జిల్లా కలెక్టర్ కు కర్నె. బాబురావు వినతి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జూలై 22
టుడే 9 ప్రతినిధి
పినపాక ఏజెన్సీ ప్రాంతంలోని ప్రైవేట్ పాఠశాలలు విద్యాహక్కు చట్టం, పాఠశాల విద్యా నిబంధనలను ఉల్లంఘిస్తూ తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సామాజిక సేవకులు కర్నె బాబురావు ఆరోపించారు.
ఈ మేరకు ఆయన సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ అంకిత కి వినతి పత్రం అందజేశారు.
*ఫిర్యాదులో ప్రధాన అంశాలు.
- *ఏకపక్ష ఫీజుల పెంపు. పాఠశాల విద్యా నిబంధనల ప్రకారం ఫీజు పెంచే ముందు తల్లిదండ్రుల కమిటీ ఆమోదం, డి ఈ ఓ అనుమతి తప్పనిసరి. అయినా మణుగూరు మండల పరిధిలోని పలు ప్రైవేట్ స్కూళ్లు 25% నుండి 50% వరకు ఏకపక్షంగా ఫీజులు పెంచుతున్నాయి.
- నోటీసు బోర్డులో ఫీజుల ప్రదర్శన లేదు: విద్యాహక్కు చట్టం సెక్షన్ 13(1) ప్రకారం ప్రతి స్కూల్ నోటీసు బోర్డుపై ఫీజు వివరాలు పెట్టాలి. కానీ కొన్ని పాఠశాలలు దీన్ని పాటించకుండా ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నాయి.
- పుస్తకాల బలవంతపు అమ్మకాలు: కొన్ని పాఠశాలలు నిర్దిష్ట పుస్తక స్టాళ్లతో కుమ్మక్కై తల్లిదండ్రులను అక్కడే పుస్తకాలు కొనాలని బలవంతపెడుతున్నాయి. మార్కెట్ ధర కంటే 2-3 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నాయి. దీనివల్ల తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- అనుమతి లేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై తనిఖీలు నిర్వహించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి.
- పుస్తక స్టాళ్లతో కుమ్మక్కైన స్కూళ్లు, స్టాళ్లపై విచారణ జరిపి లైసెన్సులు రద్దు చేయాలి.
- అన్ని పాఠశాలల్లో ఫీజుల వివరాలను నోటీసు బోర్డుపై తప్పనిసరిగా ప్రదర్శించేలా ఆదేశాలు జారీ చేయాలి.
- జిల్లా విద్యాశాఖ అధికారి 19-06-2026న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం స్కూల్ యూనిఫాం, స్టడీ మెటీరియల్, పుస్తకాలను స్కూళ్లలో అమ్మకూడదన్న నిబంధనను కఠినంగా అమలు చేయాలి.
విద్యను వ్యాపారంగా మార్చకుండా, తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Post Views: 13









