గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి.టిపిటిఎఫ్..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జూలై 22
టుడే 9 ప్రతినిధి

దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గిరిజన సంక్షేమ ఉపసంచాలకులు చందన కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించడం జరిగిందని రాష్ట్ర ఉపాధ్యక్షులు బుటారి రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి జె.రాంబాబు లు ఒక ప్రకటనలో తెలియజేశారు.

గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ హైదరాబాద్ ఆదేశాలను అనుసరించి డి వై .ఈ .ఓ ను. స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఉపాధ్యాయురాలను జీసీడి ఓ గా నియమించాలని, ఇతర పాఠశాలలో ఉపాధ్యాయుల అవసరతను బట్టి విద్యార్థుల సంఖ్యాబలం ఆధారంగా డిసెండింగ్ ఆర్డర్లో సర్ప్లస్ టీచర్లను గుర్తించి, సీనియారిటీ ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించి డిప్యూటేషన్ వేయాలని, ఈ ప్రక్రియలో సీనియర్ ను ఆప్షనల్ గా జూనియర్ కంపల్సరిగా పరిగణించి కౌన్సిలింగ్ ద్వారా డిప్యూటేషన్లు నిర్వహించాలని కోరారు.

ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేయాలని, చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు అవసరమైన డాక్యుమెంట్లతో సమర్పించబడిన కారుణ్య నియామక ప్రతిపాదనలు సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉంటున్నాయని సదరు ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని, ఉపాధ్యాయుల సస్పెన్షన్ పీరియడ్ లను సెటిల్మెంట్స్ చేయాలని, ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులరైజేషన్ & ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రతిపాదనలు పెండింగ్లో ఉంటున్నాయన్నారు . సదరు పైళ్లను వెంటనే పరిష్కరించాలని, డి యస్ సి – 2008 కాంట్రాక్ట్ సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుల జీతాలను ది.12.06.2026 నుండి చెల్లించాలని, ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నప్పుడు మాత్రమే రిటైర్మెంట్ ఆర్డర్ ను ఇస్తున్నారని,. ఇందువల్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు కావడానికి ఆలస్యం అవుతున్నదన్నారు .

ప్రతి సంవత్సరం జనవరి. డిసెంబర్ నెలలో ఉద్యోగ విరమణ పొందుతున్న ఉపాధ్యాయుల రిటైర్మెంట్ క్యాలెండర్ ను విడుదల చేయాలని కోరారు , 1997. 2012 డీఎస్సీ ఉపాధ్యాయుల విషయంలో .తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, హైదరాబాద్ ఆదేశములు అమలు చేయాలని, మెడికల్ రియంబర్స్మెంట్ ప్రతిపాదనలను మంజూరి కొరకు ఉన్నతాధికారులకు వెంటనే పంపించి సంబంధిత ఉపాధ్యాయులకు సమాచారం అందించాలన్నారు

ఇది ఇలా ఉంటే మంజూరు తదుపరి సపోర్టింగ్ ఆదేశాలను ఒరిజినల్ బిల్స్ ఎటువంటి జాప్యం లేకుండా ఉపాధ్యాయులకు అందించాలని, ఉన్నత పాఠశాలలలో ఎఫ్ ఏ సి ప్రధానోపాధ్యాయులుగా నియమింపబడి పనిచేస్తున్న వారికి ఎఫ్ ఏ సి అలవెన్స్ లను చెల్లించాలని, వేసవి సెలవులలో పదవ తరగతి విధులు నిర్వహించిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రిజర్వేషన్ న్యూస్ మంజూరు చేయాలని, ఉపాధ్యాయుల వ్యక్తిగత సమస్యలు వెంటవెంటనే పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బుటారి రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి జోగా రాంబాబు రాష్ట్ర కౌన్సిలర్ కె.మాధవరెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పి.కృష్ణయ్య సభ్యులు సి ఆర్టిలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు