ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ప్రారంభమైంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘రాజ్యాంగం జిందాబాద్’ అంటూ యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో పాల్గొనేందుకు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్, సీజేపీ అధికార ప్రతినిధి విజేత దహియా లు హాజరయ్యారు..సోషల్ మీడియా వేదికగా లక్షల మంది ఫాలోయర్స్ ఉన్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ, ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వస్తున్న క్రమంలో, బొద్దింకలు రోడ్డు మీదకు రాలేవు అన్న విమర్శను ఎదుర్కొనేందుకు సిద్ధమై మొన్నా మధ్య డిల్లీలో,ఈ రోజు హైదరాబాద్ లో ప్రజల మధ్యలోకి వచ్చి ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడం ఇది రెండోసారి.
కాక్రోచ్ జనతా పార్టీ సభలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజీనామా చేస్తే నేనేం మంత్రిని అవ్వను.. “నాడు రైలు ప్రమాదానికి బాధ్యతగా లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు…. నేడేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయాలు. ఉల్లిగడ్డల ధరలు పెరిగాయని ఆర్థికమంత్రిని అడిగితే నేను తిననంటారు, ఇంధన ధరలడిగితే బంగారం కొనొద్దంటారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు కోరుతున్నామంటే …రాజకీయ జవాబుదారీతనం కోసమే”అని అన్నారు.









