•వర్షాకాలం వస్తున్నందున ముందస్తు ప్రణాళికతో ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి.
.•పంచాయితీ కార్మికులకు నెల నెలా వేతనాలు చెల్లించండి..
•గ్రామసభలో స్థానిక సమస్యలపై గళ మెత్తిన సిపిఎం.
•సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి...
భద్రాచలం జూన్ 8 : TODAY 9 ప్రతినిధి
99 రోజుల పాలనలో భాగంగా భద్రాచలం గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభలో పాల్గొని భద్రాచల పట్టణంలోని వివిధ కాలనీల సమస్యలపై సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి మాట్లాడుతూ భద్రాచలo పట్టణంలోని అనేక కాలనీలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదని పాలకవర్గ ముందు తెలియపరిచారు. పట్టణంలో ముఖ్యంగా డ్రైనేజీల క్లీనింగ్ అస్తవ్యస్తంగా ఉన్నదని రోజు రావలసినటువంటి చెత్త ఆటోలు రెగ్యులర్గా రావడం లేదని అధికారులు దృష్టికి తీసుకువచ్చారు.
అనేక మందికి మీటర్లు లేక కరెంటు పోల్స్ సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని , రామాలయం ఎదురుగా ఉన్నటువంటి డ్రైనేజీ ను తక్షణమే పూర్తి చేయాలని,ఏ ఎంసి కాలనీలో మధ్యంతరంగా ఆగిపోయిన డ్రైనేజీని పూర్తి చేయాలని కోరారు. రాజుపేట కాలనీలో నిర్మించిన డ్రైనేజీ మధ్యలో ఆగిపోయినదని దానిని వెంటనే పూర్తి చేయాలని భగీరథ మంచినీటి పథకం ద్వారా అందించే నీళ్లను కనీసం రెండు గంటలైనా ఇవ్వాలని విన్నవించారు.
కరకట్ట నిర్మాణానికి వరద ముంపు రాకుండా అధికారులతో మాట్లాడి ముందస్తు ప్రణాళికతోవెంటనే ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలని మొక్కలు నాటేటప్పుడు కరెంటు తీగలు కింద కాకుండా జాగ్రత్తలు తీసుకుని మొక్కలు నాటాలని సూచించారు. ఇదిలా ఉంటే రాబోయే వర్షాకాలంలో విష జ్వరాలు ప్రబలకుండా పోజింగ్, దోమల మందు జాగ్రత్తలు చేపట్టాలని కేవలం రోడ్లు నిర్మించడమే కాకుండా అన్ని కాలనీలో డ్రైనేజీలు ఒక పద్ధతి ప్రకారం నిర్మించాలని గ్రామసభ వేదికగా పాలకమండలి, పంచాయతీ అధికారులను కోరారు . స్థానిక గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని .గ్రామసభ ముందు ఉంచారు. భవిష్యత్తులో వీటన్నిటిని పంచాయతీ అధికారులు పాలకమండలి సమన్వయంతో అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పట్టణ కమిటీ సభ్యులు, నగరికంటి నాగరాజు, కనక శ్రీ, అజయ్ కుమార్ ,భూపేందర్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు









