ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.

సబ్ కలెక్టర్ మృనల్ శ్రేష్ట.

భద్రాచలం జూన్ 8 : TODAY 9 ప్రతినిధి

ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకున్న ప్రజలకు సంబంధిత అధికారులు వారి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజలు వారికి సంబంధించిన వివిధ సమస్యల గురించి నేరుగా ప్రజావాణిలో విన్నవించుకోవాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట అన్నారు.

సోమవారం నాడు సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ అధికారుల సమక్షంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులకు పంపుతూ దరఖాస్తుదారులు కోరిన విధంగా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే విధంగా చర్యలతో పాటు రెవెన్యూ కు సంబంధించిన సమస్యలు వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులు తీసుకోవాలని ఆయన అన్నారు. ఇందులో ముఖ్యంగా   రెవిన్యూ సమస్యలు, పింఛన్లు, వివిధ సంక్షేమ పథకాలతో పాటు పలు సమస్యలపై ప్రజలు అర్జీలు పెట్టుకున్నారని ఆయన అన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన పలు దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్ చేసి సంబంధిత డివిజన్ అధికారులకు పంపుతూ, ప్రతి ఫిర్యాదుపై సంబంధిత శాకాధిపతులు వ్యక్తిగత పర్యవేక్షణ చేసి, నిర్ణీత గడువులో పరిష్కారం జరిగేలా చర్యలు చేపట్టాలని, పెండింగ్ లేకుండా చూసుకోవాలని ఆయన అన్నారు. 

ఈ కార్యక్రమంలో భద్రాచలం తాసిల్దార్ తోట రవికుమార్, డిఎల్పిఓ సుధీర్, డీఏవో భగవాన్ రెడ్డి, ఆర్ అండ్ బి డి ఈ సతీష్  భద్రాచలం డివిజన్ పరిధిలోని వివిధ శాఖల డివిజనల్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు