బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగడం భారతదేశానికే అవమానకరం. కేటీఆర్

బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగడం భారతదేశానికే అవమానకరం అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.ప్రధానమంత్రి తరచూ చెపుతున్న.. బేటీ బచావో, బేటీ పడావో కేవలం నినాదాలకే పరిమితమా? అని ప్రశ్నించారు కేటీఆర్.బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయకుంటే విచారణ పారదర్శకంగా జరిగే అవకాశం లేదని అభిప్రాయ పడ్డారు. కాగా బండి సంజయే ఆయన కొడుకును 9 రోజులు దాచిపెట్టిండు. బాలిక కుటుంబాన్ని బెదిరించి, భయభ్రాంతులకు గురి చేసిండు అంటూ తీవ్ర విమర్శలు చేశారు కే టీ ఆర్.

ప్రధానమంత్రి బేటీ బచావో.. బేటీ పఢావో అంటాడు.. కానీ పోక్సో కేసులో కేంద్ర మంత్రి కొడుకు మీద లుక్ అవుట్ నోటీసులు ఇచ్చే పరిస్థితి వచ్చింది అంటూ అసహనం వ్యక్తం చేశారు.మైనర్ బాలికను అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకు అయితే.. మైనర్ బాలిక తల్లిదండ్రులను భయపెట్టింది కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కలిసి హనీ ట్రాప్ అని మీడియాని మనీ ట్రాప్లో వేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు