భద్రాచలం డిఎస్పీ అరుణ్ కుమార్
భద్రాచలం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీ,మనుబోతుల చెరువు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో భద్రాచలం పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం…
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో భద్రాచలం డిఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 4.30 గంటల నుండి 7.30 గంటల వరకు మూడు గంటల పాటు భద్రాచలం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీ,మనుబోతుల చెరువు డబుల్ బెడ్ రూమ్ కాలనీల్లో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం ను నిర్వహించారు.

ఇందులో భాగంగా మొత్తం సుమారుగా 300 ఇండ్లలో సోదాలు నిర్వహించి సరిగా పత్రాలు,నంబర్ ప్లేట్స్ లేని 30 ద్విచక్ర వాహనాలను,05 ఆటోలను,సీజ్ చేసి సుక్మా జిల్లాకు చెందిన ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది.అనంతరం కాలనీల్లో నివసించే స్థానికులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి డిఎస్పీ పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట,వ్యతిరేక,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు.తమ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు..

మట్కా,జూదం,కోడిపందాలు,బెట్టింగ్,గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడమైనదన్నారు.తమ కాలనీల్లోకి కొత్తగా ఎవరైనా వ్యక్తులు అద్దెకు వస్తే,ఇంటి యజమానులు వారి ఆధార్ కార్డు,చిరునామాలను సేకరించి పెట్టుకోవాలని సూచించారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేసారు.విపత్కర సమయాల్లో ఆపదలో ఉన్నప్పుడు డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీస్ వారి సేవలను పొందాలని సూచించారు.సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.నేరాల నియంత్రణ కొరకు తమ నివాస ప్రాంతాలలో సీసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.సుమారుగా 100 మందికి పైగా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో భద్రాచలం ఇన్స్పెక్టర్ నాగరాజు,ఎస్సైలు తిరుపతి,స్వప్న,రామకృష్ణ,సీఆర్పిఎఫ్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.









