రాజుపేట లో సైడ్ డ్రైన్ నిర్మాణం పనులను వెంటనే పూర్తి చేయాలి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో: భద్రాచలం మే 9
టుడే 9 ప్రతినిధి

భద్రాచలం గ్రామపంచాయతీ అభివృద్ధి నిధులలో భాగంగా 20వ వార్డు పరిధిలో ఎమ్మెల్యే కాలనీలో ఐదు లక్షల రూపాయలతో చేపట్టిన డ్రైన్ నిర్మాణ పనులకు ఆటంకంగా మారిన కట్టడాలను వెంటనే తొలగించి డ్రైన్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని సిపిఎం 20వ వార్డ్ మెంబర్ ఇరప అనసూయ ఆధ్వర్యంలో వార్డు ప్రజలందరూ గ్రామపంచాయతీ ఈవో ను కలిసి వినతి పత్రం సమర్పించారు.. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ అభివృద్ధి పనులకు వచ్చే ఆటంకాలను తొలగించి సైడ్ డ్రైన్ నిర్మాణo పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి లు మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని అన్నారు. సిపిఎం గెలిచిన వార్డుల నందు అభివృద్ధి పనులు పారదర్శకంగా జరిగేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగో వార్డ్ మెంబర్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు, పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు డి. సీతాలక్ష్మి, సీనియర్ నాయకులు, పార్టీ పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి, డి. కనక శ్రీ, హైమావతి, బేగం, లక్ష్మీనారాయణ,పద్మ, సముద్రల రమణ,భషీర్,మల్లూరు,శ్రీదేవి,తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు