సిఐటియు- సిపిఎం, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం.
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో : భద్రాచలం: మే3
టుడే 9 ప్రతినిధి
గత 38 సంవత్సరాలుగా ఆర్టీసీలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేస్తున్న తాతోలు దుర్గా చార ఉద్యోగ విరమణ అనంతరం తన శేష జీవితం ప్రజా ఉద్యమాలలో భాగస్వామ్యం కావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ జె రమేష్ కోరారు. తెలంగాణ ఆర్టీసీలో 38 సంవత్సరాల సుదీర్ఘకాలం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న తాతోలు దుర్గాచారి తన శేష జీవితం ప్రజా సమస్యలు, కార్మిక సమస్యలపై కృషి చేయాలని ఆకాంక్షించారు. దుర్గాచారి కవిగా, రచయితగా, గాయకుడిగా సాహిత్య రంగంలో తన కృషిని కొనసాగించాలని అన్నారు. తాతోలు దుర్గా చారి కి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ సిపిఎం, సిఐటియు నాయకులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, సిఐటియు నాయకులు నకరికంటి నాగరాజు, అజయ్ కుమార్, కోరాడ శ్రీనివాస్, ఎం వి ఎస్ నారాయణ, బి జె ఎల్ పి దాసు, ముత్తయ్య, మురళీకృష్ణ,ఎస్ఎఫ్ఐ రవీందర్, రవి తదితరులు పాల్గొన్నారు.
దుర్గాచారికి ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఘన సన్మానం..
ఆర్టీసీ లో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన దుర్గా చారిని స్థానిక కమ్మ కళ్యాణ మండపంలో ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం వి ఎస్ నారాయణ ఆధ్వర్యంలో భద్రాచలం డివిజన్ కోశాధికారి డి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు ఎస్ రాజబాబు, ఐటీసీ నాయకులు అజయ్, టీవీ చలం, ఆర్టీసీ నాయకులు మురళీకృష్ణ, ముత్తయ్య, డీఎస్ఎన్ రెడ్డి, రెడ్డి, తదితర ఆర్టీసీ నాయకులు పాల్గొని శాలువలతో సత్కరించారు. అనంతరం వేదికపై దుర్గాచారికి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం వి ఎస్ నారాయణ చేతుల మీదుగా ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ లో సభ్యులుగా సభ్యత్వాన్ని అందజేశారు.










