ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో : భద్రాచలం : ఏప్రిల్ 27: టుడే 9 ప్రతినిధి
ఆదివాసి గిరిజన గ్రామాల నుండి గిరిజన దర్బార్లో తమ సమస్యల గురించి విన్నవించుకోవడానికి వచ్చే గిరిజనుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందించే విధంగా సంబంధిత యూనిట్ అధికారులు కృషి చేయాలని సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. సోమవారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అధికారిక పాములపై వెళ్లి అందుబాటులో లేనందున యూనిట్ అధికారుల సమక్షంలో వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి ఆయన అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని యూనిట్ అధికారులకు ఆదేశించారు. గిరిజన దర్బార్ లో వచ్చిన అర్జీలు పొడు భూముల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు, స్వయం ఉపాధి పథకాల రుణాల కొరకు, పట్టా భూములకు రైతుబంధు రుణాల కొరకు, జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఆర్థిక సహాయం కొరకు, దీర్ఘకాలిక రోగాలకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక వేసులుబాటు కల్పించుట కొరకు, ట్రైకార్ రుణాలు, పై చదువులు చదవడానికి ఆర్థిక సహాయం కొరకు, వ్యవసాయ భూములకు కరెంటు బోరు మోటార్ ఇప్పించుట కొరకు, పొడు పట్టాలలో పేర్లు మార్పు కొరకు, నూతనంగా మత్స్య సొసైటీలు ఏర్పాటు కొరకు, సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించుట కొరకు, తమ పొలాలలో బోరు బావులు తవ్వించుటకు అనుమతి కొరకు ఇతర ఆర్థిక ప్రయోజనాల కొరకు దరఖాస్తులు చేసుకున్నారని ఆయన అన్నారు.
అశ్వరావుపేట మండలం కన్నాయిగూడెంకు చెందిన వెంకటేశ్వర పంట భూమి సమస్య పరిష్కరించుట కొరకు, టేకులపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన పూజిత పై చదువులకు ఆర్థిక సహాయం అందించుట కొరకు, లక్ష్మీదేవి పల్లి మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన మత్తయ్య సోలార్ మోటార్ కనెక్షన్ ఇప్పించుట కొరకు, చర్ల మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన సుజాత నూతనంగా ఇసుక సొసైటీ ఏర్పాటు కొరకు, గుండాల మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన నారాయణ ట్రాక్టర్ కొనుగోలుకు రుణము ఇప్పించుటకు, జూలూరుపాడు మండలం చిట్యాల తండా గ్రామానికి చెందిన పద్మ ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలో పేరు మార్పు కొరకు దరఖాస్తులు చేసుకున్నారని ఆయన అన్నారు.
గిరిజన దర్బార్ లో వచ్చిన అర్జీలు అన్ని ఆన్లైన్ ద్వారా ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి, అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు విడతల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు చేపడతామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, ఎస్ డి సి ఆనంద్ కుమార్, ఏవో సున్నం రాంబాబు, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, ఉద్యానవనాధికారి ఉదయ్ కుమార్,డి టి ఎల్ టి ఆర్ నాగేశ్వరరావు, పి వి టి జి అధికారి గన్యా నాయక్, మేనేజర్ ఆదినారాయణ, ఐసిడిఎస్ సూపర్వైజర్ అనసూయ, హౌసింగ్ ఏఈ హేమంత్, మిషన్ భగీరథ ఏ ఈ ఈ నారాయణరావు మరియు ఇతర విభాగాల సిబ్బంది నరేందర్, హరిత, సౌజన్య, వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.









