ఐటీడీఏ పిఓను అభినందించిన సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతి కుమారి .
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబ్యూరో.:భద్రాచలం: ఏప్రిల్ 21: టుడే 9
భద్రాచలం పట్టణంలో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్ ఎంతో ప్రయోజనకరమని దీని ఏర్పాటులో విశేషంగా కృషి చేసిన భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఐఏఎస్ అభినందనీయులని మెచ్చుకుంటూ, వైస్ చైర్‌పర్సన్ డైరెక్టర్ జనరల్, డాక్టర్ ఎం.సి.ఆర్ హెచ్.ఆర్.డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ ఐటీడీఏ పీవో రాహుల్ కు ప్రశంసా పత్రం పంపించారు.
భద్రాద్రి మార్ట్ చేస్తున్న ప్రశంసనీయమైన కృషిని ఈ పత్రం ద్వారా అభినందిస్తున్నట్లు తెలిపారు.

స్థానిక గిరిజన ఉత్పత్తులకు విలువను జోడించి, బ్రాండింగ్ కల్పించి, భద్రగిరి మార్ట్ ద్వారా మార్కెట్ సౌకర్యాలను కల్పించడంలో మీ చొరవ నిజంగా అభినందనీయం అన్నారు.ఈ ప్రయత్నం గిరిజన వర్గాల ఆదాయాన్ని పెంచడమే కాకుండా, వారి ఉత్పత్తులను విస్తృత మార్కెట్‌లతో అనుసంధానించడం ద్వారా వారిని సాధికారులను చేస్తుందని సమగ్ర అభివృద్ధికి ఇది ఎంతో తోడ్పడుతుందని నేను నమ్ముతున్నట్లు ఆ ప్రశంస పత్రంలో పేర్కొన్నారు.









