ఐదు పంచాయతీలపై మొదటి తీర్మానం చేయాలి…..
అంబేద్కర్ సెంటర్ నుండి చర్ల రోడ్డు కూనవరం రోడ్డు వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి..
గ్రామపంచాయతీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి
నివాస గృహాలపై ఉన్న 11 కెవి లైన్ తొలగించాలి
సిపిఐ ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్
సిపిఎం ఆధ్వర్యంలో పాలకవర్గ సమావేశానికి వినతి పత్రం సమర్పణ
భద్రాచలం గ్రామపంచాయతీ పాలకవర్గం ఏర్పడిన అనంతరం నిర్వహించే మొదటి పాలకవర్గ సమావేశంలో ఆంధ్రలో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపే విధంగా తీర్మానం చేయాలని శివారు కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా ప్రజా ప్రయోజన నిర్ణయాలను తీసుకోవాలని సిపిఐ ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ డిమాండ్ చేశారు. శనివారం సిపిఐ ఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాలకవర్గ మొదటి సమావేశానికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సర్పంచ్ పూనెం కృష్ణ కి అందించారు. ఈ సందర్భంగా ఏజే రమేష్ మాట్లాడుతూ అంబేద్కర్ సెంటర్ నుండి చర్ల రోడ్డు కూనవరం రోడ్డు లలో సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నో ఎలాగా గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలను పెంచడంతోపాటు వారి సమస్యల పరిష్కారానికి పాలకవర్గం తీర్మానం చేయాలని డిమాండ్ ఏజే రమేష్ భద్రాచలం పట్టణంలోని 14 వ వార్డు పరిధిలో అశోక్ నగర్ కొత్త కాలనీలో 11 కెవి లైన్ వల్ల ఇప్పటికి 15 మంది చనిపోయారని నివాస గృహాలపై ప్రమాదకరంగా ఉన్న ఆ విద్యుత్తు లైన్లను వెంటనే తొలగించాలని కోరారు. అదేవిధంగా కొత్త కాలనీలో మిషన్ భగీరథ కోసం సిసి రోడ్లను తవ్వి అలానే వదిలేయడం వల్ల మురుగునీరు రోడ్లపైకి చేరుతుందని తెలిపారు. కుర్రాడు గుట్ట పాలకేంద్రం సమీపంలో శిధిలవస్థకు చేరిన వాటర్ ట్యాంక్ ను వెంటనే కూల్చివేయాలని లేనిపక్షంలో పెను ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. జగదీష్ కాలనీ ఎంపీ కాలనీల మధ్య అసంపూర్తిగా ఉన్న కలవట్లను వెంటనే పూర్తి చేయాలని కోరారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే విధంగా పాలకవర్గం తీర్మానాలు చేయాలని డిమాండ్ చేశారు. ఏం సి కాలనీలలో సైడ్ నిర్మించాలని ఎల్పీజీ నగర్ రాజుపేట మనుబోతుల చెరువు సుందర నగర్ తదితర శివారు ప్రాంతాలలో ట్రైన్లు రోడ్లు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరారు. పట్టణ వ్యాప్తంగా సైడ్ డ్రైన వ్యవస్థను ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని యుద్ధ ప్రాతిపరికణ గ్రామపంచాయతీ సిబ్బంది పట్టణ వ్యాప్తంగా పారిశుద్ధ్య పనులను చేపట్టి పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దాలని కోరారు.
ప్రజా సంక్షేమ నిర్ణయాలని తీసుకుంటాం…..
పూనెం కృష్ణ భద్రాచలం సర్పంచ్
సిపిఐఎం బృందం ఇచ్చిన వినతి పత్రం పూర్తిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం గుర్తించిన సమస్యలేనని కచ్చితంగా సిపిఎం బృందం లేవనెత్తిన ప్రతి సమస్య పరిష్కారానికి పాలకవర్గం నిర్ణయం తీసుకుంటుందని భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనం కృష్ణ హామీ ఇచ్చారు. పట్టణ వ్యాప్తంగా డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని ఈ నేపథ్యంలోనే కాలనీలలో పర్యటనలు కూడా పాలకవర్గం చేస్తుందని అన్నారు. కాలనీలో నెలకొన్న సమస్యలపై ఆయా అవార్డు సభ్యులు ద్వారా సమాచారాన్ని పూర్తిస్థాయిలో సేకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం నాలుగో వార్డ్ సభ్యులు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు ఇరుప అనసూయ సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రం శెట్టి వెంకట రామారావు ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి కొప్పుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు









