తెలుగు, ఆంద్ర పై ప్రొఫెసర్ కనకదుర్గ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుకు ఆంద్రకు వ్యత్యాసం ఉందని అభిప్రాయపడ్డారు.తెలుగుకు, ఆంధ్ర వాళ్లకు అసలు సంబంధమే లేదని ప్రొఫెసర్ దంటు కనకదుర్గ స్పష్టం చేశారు.పురాణాలు, నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగడ రచనల్లో “ఆంధ్ర” ప్రస్తావన ఉందని, పాల్కురికి సోమనాథుడు మాత్రం “జాను తెలుగు”లో రచన చేశానని తానే స్వయంగా పేర్కొన్నారని తెలియజేశారు కనకదుర్గ. కాగా1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల భావనను ముందుకు తెచ్చారని అభిప్రాయపడ్డారు.
పురాణాలు చూసినా వాళ్ళ జాతి ఆంధ్ర జాతి, వాళ్ళ భాష ఆంధ్ర భాష, వాళ్ళ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం అనే ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు
నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగడలను చూసినా వారు మేము ఆంధ్రములోకి వనరించి అని అన్నారే కానీ తెలుగులోకి అని అనలేదని, ఇక్కడ పాల్కురికి సోమనాథుడు బసవపురాణం రాసినప్పుడు కూడా తాను జాన తెలుగులో రాశానని ఆంధ్రములో రాయనందుకు రిజెక్ట్ చేయకండి అని వేడుకున్నాడని పేర్కొన్నారు
1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వచ్చాక ముందు వెనక చూడకుండా కేంద్రం నుండి పన్నెండున్నర కోట్లు అప్పు చేసి చతికిల పడ్డారని తెలియజేశారు అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను కలపాలనే అంశం తీసుకొచ్చి మన తెలుగు భాషను ముందుకు తెచ్చారన్నారు ప్రొఫెసర్ దంటు కనకదుర్గ







