ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైంది అంటూ ప్రశ్నించిన లంబాడ సామాజిక వర్గ నేతలు… గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత…
తెలంగాణ మంత్రి మండలిలో అన్ని వర్గాలకూ చోటు కల్పించి మా సామాజిక వర్గానికి మాత్రం అన్యాయం చేశారు అంటూ లంబాడా సామాజిక వర్గానికి చెందిన కొందరు గాంధీ భవన్ ముందు ఆందోళనకు సిద్ధపడ్డారు . గాంధీ భవన్ లోపలికి చొచ్చుకు పోవటానికి ప్రయత్నించటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సీఎం డౌన్ డౌన్ అనే నినాదాలు చేయటంతో గాంధీభవన్ పరిసర ప్రాంతాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
లంబాడా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ వర్గం నేతలు గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఆ తర్వాతే బస్సు యాత్ర చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Post Views: 18







