బి ఎల్ ఓ. బి ఎల్ ఎ. సర్ పక్రియ షెడ్యూల్ పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జులై 24
Today 9 ప్రతినిధి

పారదర్శక ఓటరు జాబితా కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని భద్రాచలం నియోజకవర్గం ఏఈఆర్ఓ. తాసిల్దార్ కోట రవికుమార్ సంబంధిత బిఎల్ఓ, బి ఎల్ ఏ లకు సూచించారు.

  బుధవారం నాడు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భద్రాచలం నియోజకవర్గం బిఎల్ఓ. బిఎల్ఎ లకు సర్- ప్రక్రియ షెడ్యూల్ గురించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు .
  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి ఎల్ ఓ, బి ఎల్ ఏ లకు కొన్ని సూచనలు ఇస్తూ  ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఎస్.ఐ.ఆర్ సర్వేను పురస్కరించుకుని భద్రాచలం నియోజకవర్గ బూత్ లెవెల్ ఆఫీసర్లు, సూపర్వెజర్లు. ఎస్.ఐ.ఆర్ సర్వే ఎలా చేయాలి, ఏయే అంశాలను పరిశీలించాలి, ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, పాటించాల్సిన పద్దతులపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. కీలక అంశాలను వివరిస్తూ బీ.ఎల్.ఓలకు దిశానిర్దేశం చేశారు. ఎస్.ఐ.ఆర్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 నుండి జూలై 24 వరకు బిఎల్వోలు ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఓటరు మ్యాపింగ్ ను పూర్తి చేయాలని సూచించారు. 


ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ నిర్వహణలో పాల్గొంటున్న బీ.ఎల్.ఓలకు సర్వే కాలంలో నెల రోజుల పాటు వారివారి శాఖలకుసంబంధించిన దైనందిన విధుల నుంచి మినహాయింపు కల్పించారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఎస్.ఐ.ఆర్ పైనే పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరిస్తూ, ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పకడ్బందీగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. 

ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారు ఇతర ప్రాంతానికి శాశ్వతంగా వలస వెళ్ళారా, మృతి చెందారా, రెండు చోట్ల పేర్లు ఉన్నాయా అనే అంశాలను నిశితంగా గమనించాలని సూచించారు. ఎస్.ఐ.ఆర్ సర్వే వివరాల ఆధారంగానే ఓటరు జాబితాను రూపొందించనున్న దృష్ట్యా పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా సర్వే జరపాలని అన్నారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని, ఏవైనా సందేహాలు ఉంటే ఏమాత్రం సంకోచించకుండా శిక్షణ తరగతులలో నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఒక్క ఓటరు కూడా తప్పిపోకుండా చూడాలని, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర వి.ఐ.పీల మ్యాపింగ్ పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ.టీ.పీని ఇతరులకు తెలుపకుడదని, ఇలా చేయడం నేరంగా పరిగణించటపడుతుందని అన్నారు.

ఇంటింటి గణన ఈనెల 25 నుండి వచ్చే నెల 24వ తేదీ వరకు, ముసాయిదా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ 31 జులై వరకు, క్లైమ్ లు. అభ్యంతరాల దాఖలు కాలం 31 జులై నుండి 30 ఆగస్టు వరకు, నోటీసు దశ, జారీ విచారణ ధ్రువీకరణ 31 జులై నుండి 28 సెప్టెంబర్ వరకు, తుది ఓటర్ల జాబితా ప్రచురణ 01 అక్టోబర్ 26 వరకు సర్ 2026 ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

   ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డిటి గోపాలకృష్ణ, సీనియర్ సహాయకులు రామయ్య, బిఎల్ఓ సూపర్వైజర్లు . కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు