పారిస్ పర్యటనలో భారత ప్రధానిని చూసేందుకు ప్రవాస భారతీయులు ఉత్సాహం చూపించారు. నిన్న ప్రాన్స్ లో పర్యటించేందుకు పారిస్ చేరుకున్న మోదీ కి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.ఫ్రాన్స్ ప్రభుత్వ అధికారులతో పాటు ప్రవాస భారతీయులు సైతం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ప్రధాని మోదీకి పారిస్‌లో ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. ఇండియన్ డయాస్పోరా ఆధ్వర్యంలో ఆయన్ను చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మోదీ షేక్ హ్యాండ్, ఆటోగ్రాఫ్‌లు, ఫొటోల కోసం అక్కడి భారతీయులు ఆసక్తి చూపారు. ప్రధాని ఓపికగా నవ్వుతూ అందరినీ పలకరించారు. భారత్, ఫ్రాన్స్‌ను మరింత దగ్గర చేయడానికి ప్రవాసులు చేస్తున్న ప్రయత్నాల పట్ల గర్వపడుతున్నట్లు ప్రధాని మోదీచెప్పారు.
Post Views: 22







