సర్వాంగ సుందరంగా ముస్తాబైన మైత్రివనం చౌరస్తా!
నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది.. ఇందుకోసం మైత్రివనం చౌరస్తాను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ మైత్రివనం చౌరస్తాలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఈరోజు అధికారికంగా ఆవిష్కరించనున్నారు.
ఈ చారిత్రాత్మక వేడుక కోసం మైత్రివనం జంక్షన్‌ను రంగురంగుల విద్యుత్ దీపాలు, భారీ తోరణాలు, పూలమాలలతో అత్యంత వైభవంగా అలంకరించారు. ముఖ్యమంత్రి రాకతో పాటు నగర నడిబొడ్డున అన్నగారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండటంతో నందమూరి అభిమానులు, రాజకీయ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Post Views: 22







