దొంగ నాటకాలు చేస్తే ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది… ఎంపీ అరవింద్…

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన సొంత పార్టీ కార్యకర్తలపై చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తమ పార్టీ నేతల్లో కొందరు సీనియర్లు దొంగ నాటకాలు ఆడుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు అరవింద్.

మా పార్టీ నేతలు కొందరు కావాలనే రోడ్డుపై దొంగ ధర్నాలు చేస్తున్నట్లు నటించి, పోలీసులకు వారే స్వయంగా ఫోన్ చేసి పిలిపించుకుని అరెస్టవుతున్నారు అంటూ సంచలన ప్రకటన చేశారు అరవింద్. ఇలా చేస్తే ఇంట్లో కూర్చోవలసి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు