మత పెద్దలతో ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ మీటింగ్లో డిఎస్పీ అరుణ్ కుమార్.
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో: భద్రాచలం మే 8 : టుడే 9 ప్రతినిధి
శాంతియుత వాతావరణంలో పండుగలను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని భద్రాచలం డిఎస్పీ అరుణ్ కుమార్ అన్నారు.రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం డిఎస్పీ కార్యాలయంలో మతపెద్దలతో పీస్ కమిటీ మీటింగ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పండగలను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ప్రజలంతా పండుగలను మతసామరస్యంతో జరుపుకునే విధంగా ఆయా మతాల పెద్దలు ప్రజల్లో సమన్వయం ఏర్పడేలా చేయాలన్నారు.పండుగ ఏ మతానిది అయిన సామరస్యత చాలా మంచి సంబంధాలను పెంపొందిస్తుందన్నారు.ఈ నెలలో జరగబోయే బక్రీద్ పండుగ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో జరిగేలా మత పెద్దలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
శాంతిభద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని,ఎవరైనా గొడవలు సృష్టించేలా వ్యవహరిస్తే వెంటనే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ పీస్ కమిటీ సమావేశంలో టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు,ఎస్సై రామకృష్ణ మరియు భద్రాచలంలోని మత పెద్దలు పాల్గొన్నారు.










