ఏసీబీ వలలో అటవీ శాఖ పెద్ద తలలు

రూ 3. 5లక్షలు లంచం తీసుకుంటు ఏసీబీ కి చిక్కిన భద్రాచలం ఎఫ్ డి ఓ, డి ఆర్ ఓ

ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో : భద్రాచలం మే 07
టుడే 9 ప్రతినిధి

ఒక రోడ్డు వేస్తుండగా కొన్ని చెట్లు కట్ కావడం తో వాటి గురించి కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భద్రాచలం అటవీ శాఖ ఎఫ్ డి ఓ సుజాత రూ పది లక్షలు డిమాండ్ చేసి గురువారం రూ 3.5 లక్షలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో ఆమెను, చర్ల ఇంచార్జ్ డి ఆర్ ఓ కృష్ణయ్య ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతం లో రోడ్డు వేస్తుండగా పొరపాటున చెట్లు దెబ్బ తిన్నాయి ఈ ఎపిసోడ్ లో ఎఫ్ డి ఓ సుజాత పది లక్షలు డిమాండ్ చేసి భద్రాచలం కార్యాలయం లో 3.5 లక్షలు లంచం తీసుకుంటు డి ఆర్ ఓ తో పాటు పట్టుబడ్డారు.గతం లో కూడా కొత్తగూడెం అటవీ అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి మూడున్నర లక్షలు లంచం తీసుకుంటు పట్టుబడ్డారు. అటవీ శాఖ లో అవినీతి పేరుకుపోయింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు