భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరోభద్రాచలం మే 3టుడే 9 ప్రతినిధి
భద్రాచలం ప్రజల భక్తుల ఆదరాభిమానాలతో గోదావరి నదిహారతి పురోహితుల మంత్రోచ్ఛారణలతో అంగరంగ వైభవంగా జరిగిందని రామావజ్జల రవికుమార్ పేర్కొన్నారు. ఆదివారం భద్రాచలంలో గోదావరి కరకట్ట దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయములో జరిగిన నదీహారతి కార్యక్రమములో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్రస్వామి కొలువై ఉన్న ప్రదేశంలోని గోదావరి తీరంలో సాయంత్రం 6:30 గంటలకు గోదావరి నదిహారతిని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీరామ స్మరణతో గోదావరినదీ ప్రాంతం మార్మోగిందని ఆనందం వ్యక్తం చేశారు.

భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో గోదావరి హారతి నిర్వహించారు.దేశ విదేశాల నుండి వచ్చే భక్తులు నదిహారతి కార్యక్రమంలో పాల్గొని పునీతులు అవుతున్నారని రవికుమార్ తెలిపారు..అనంతరం పురోహితులు గోదావరి హారతి విశేషాలను భక్తులకు వివరించారు, గణపతి పూజ చేసి, జైశ్రీరామ్ అలంకారంలో 108 ప్రమిదలతో దీపోత్సవం నిర్వహించారు. అనంతరం పూజా ద్రవ్యాలతో గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేశారు, పురోహితులు. శ్రీరామ అష్టోత్తరం పటిస్తుండగా ఓం శ్రీ రామాయ నమః అంటూ108 సార్లు భక్తులచే శ్రీరామ నామ భజన అనంతరం ముందుగా సీతారామచంద్రస్వామికి ఆనంతరం గోదావరి నదికి హారతిఇవ్వడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు, లోక కళ్యాణార్థం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ మహాత్కార్యంలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, రామాను గ్రహంతో గోదావరి మాత ఆశీస్సులు పొందాలని రవికుమార్ ఆకాంక్షించారు. బూర్గంపాడు మండలం సారపాక శ్రీ చైతన్య పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విహారిక క్లాసికల్ డాన్స్ ను ప్రేక్షకులు వీక్షించి ఆనందించారు. ఈ కార్యక్రమంలో పురోహితులు కారంబరీ కృష్ణ శర్మ, రామాచార్యులు, ఫణి కుమార్ శర్మ, సత్య ప్రసాద్ శర్మ, తేజ శర్మ, స్వచ్చంద సంస్థలు, భద్రాద్రి కా మహారాజు ప్రతినిధులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.









