భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో :భద్రాచలం: ఏప్రిల్ 30: టుడే 9 ప్రతినిధి
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ అనేది తప్పనిసరి అని కాగా తాను చేస్తున్న ఉద్యోగానికే కానీ జీవితానికి కాదని, ప్రతి ఒక్క ఉద్యోగి ఉద్యోగంలో చేరినప్పుడే రిటైర్మెంట్ అనేది తప్పదని ఉద్యోగం చేసినన్ని రోజులు తన విధులు సక్రమంగా నిర్వహించి ప్రజల చేత ,అధికారుల మన్ననలు పొందినప్పుడే తను చేసిన ఉద్యోగానికి సార్ధకత లభిస్తుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.గురువారం నాడు తన చాంబర్లో ఉద్యోగ పదవీ విరమణ పొందుతున్న ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేయుచున్న ముత్తయ్య కుటుంబ సభ్యులు సిబ్బంది సమక్షంలో ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్ తో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1986 వ సంవత్సరంలో ఇంజనీరింగ్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరి తన ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారని ఆయన అన్నారు. 40 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉద్యోగ విరమణ పొందడం బాధాకరమైన, ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి శాశ్వతం కాదని తప్పనిసరిగా రిటైర్మెంట్ తప్పదని, తన శేష జీవితాన్ని తన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని, అలాగే తాను చేసిన కార్యాలయాలలో సిబ్బందికి వారి విధుల పట్ల ఏమైనా సమస్యలు వస్తే తన సహాయ, సహకారాలు అందించాలని ఆయన అన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందుతున్న ముత్తయ్య (టెక్నికల్ అసిస్టెంట్) ను సిబ్బంది ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డి ఈ హరీష్, డి ఏ ఓ శంకరాచార్యులు, పర్యవేక్షకుడు వెంకటస్వామి, ఖమ్మం సూపర్డెంట్ మహేష్ కుమార్, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయం డిఇలు, ఏఈలు సిబ్బంది భవాని, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.









