మధుసూధన్​ మరణం బాధాకరం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో: భద్రాచలం: ఏప్రిల్ 27: టుడే 9 ప్రతినిధి


టీయూడబ్ల్యుజే(ఐజేయూ).తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చీఫ్​ పబ్లిక్​ రిలేషన్​ ఆఫీసర్​ మారబోయిన మధుసూధన్​ గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమని భద్రాద్రికొత్తగూడెం జిల్లా టీయుడబ్ల్యుజే (ఐజేయూ) కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఇమంది ఉదయ్​కుమార్​, మొబగాపు ఆనంద్​కుమార్​లు సోమవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ఆంధ్రజ్యోతి బ్యూరోగా పనిచేసిన ఆయన తోటి జర్నలిస్టుల మిత్రులతో చాలా కలివిడిగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. విధి నిర్వహణలో నిఖార్సైన పాత్రికేయుడిగా పేరు తెచ్చుకున్నారని, జర్నలిస్టు లోకం మంచి మిత్రుడిని కోల్పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి ఆత్మస్తైర్యం కల్పించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు