మే డే సందర్భంగా జరిగే ర్యాలీని, సభను జయప్రదం చేయండి.
పిలుపునిచ్చిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో: భద్రాచలం: ఏప్రిల్ 27: టుడే 9 ప్రతినిధి
కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకవర్గాలకు కనువిప్పు కలిగేలా కార్మికులు కర్షకులు ఐక్యంగా మేడే ఉత్సవాలను నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి లు పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ పట్టణ స్థాయి జనరల్ బాడీ సమావేశం వై వెంకట రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 140 ఏళ్ల క్రితం అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మికుల హక్కుల కోసం జరిగిన నిరసన ర్యాలీపై ప్రభుత్వం జరిపిన దమనకాండ ఫలితంగా ప్రాణాలు కోల్పోయిన కార్మికుల రక్తం నుండి పుట్టినది ఎర్ర జెండా అని ఆ జెండా నీడలోనే కార్మికుల హక్కులు సాధించబడ్డాయని అన్నారు. అనేక పోరాటాలు ఉద్యమాలు ఫలితంగా సాధించుకున్న హక్కులను నేడు దేశాన్ని పాలిస్తున్న పాలకులు కాలరాస్తున్నారని ఆ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు కర్షకులు సమస్త ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. నేడు దేశంలో పెట్టుబడిదారులే రాజకీయ నాయకులుగా చలామణి అవుతూ ప్రభుత్వాలను శాసిస్తున్నారని, పెట్టుబడి దారుల ప్రయోజనాలకు అనుగుణంగా శాసనాలు చేయబడుతున్నాయని దుయ్యబట్టారు. నాటి మేడి అమరవీరుల స్ఫూర్తితో పాలకవర్గాలు అనుసరిస్తున్న కార్పొరేట్ పెట్టుబడిదారుల విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచ కార్మికుల దినోత్సవం “మే డే” వాడవాడలా పెద్ద సంఖ్యలో కార్మికులు కర్షకులు ప్రజలు పాల్గొని పాలకవర్గాలకు కనువిప్పు జరిగేలా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మే డే సందర్భంగా సిపిఎం కార్యాలయంలో జరిగే సభను ర్యాలీని జయప్రదం చేయాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి సంతోష్ కుమార్ డి సీతాలక్ష్మి సీనియర్ నాయకులు బిబిజి తిలక్,పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి,యు జ్యోతి,ఎన్ నాగరాజు, జీవనజ్యోతి, కుంజా శ్రీనివాస్,అజయ్ కుమార్, కోరాడ శ్రీనివాస్ , కొలగాని రమేష్,
ఏ.రత్నం,భూపేంద్ర, జోన్ కన్వీనర్ డి రామకృష్ణ శాఖా కార్యదర్శులుఎస్. వేణు,కాకా రమణ, వై పూర్ణిమ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.









