భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో: భద్రాచలం : ఏప్రిల్ 22 : టుడే 9 ప్రతినిధి
.
భద్రాచలం ఆర్టిసి కార్మికుల సమస్య పరిష్కారం కోసం సమ్మెలోకి దిగిన కార్మికులకు సిపిఎం సిఐటియు సంపూర్ణ మద్దతు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం బీ నర్సారెడ్డి సిఐటియు జిల్లా నాయకులు వై వి రామారావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని జరుగుతున్నటువంటి ఈ సమ్మెకు సిపిఎం సీఐటీయూ సంపూర్ణ మత తెలియజేస్తుందని గత ప్రభుత్వం హయాంలో జరిగిన సమ్మెలో అగ్రభాగాల నిలిచామని విజయం సాధించేంతవరకు పోరాటం చేయడం జరిగిందని ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వెంటనే పరిష్కారం చేయాలని ప్రభుత్వంలో విలీనం ఇతర కార్మిక సమస్యలను పరిష్కరించాలని కార్మికులను పెట్టి చాకిరి చేయించుకుంటూ వారికి రావలసిన రాయితీలను ప్రభుత్వం ఇవ్వట్లేదని ఈ కాలంలో ఆర్టీసీ కార్మికుల పై వేధింపులు పెరిగాయని పని వారం పెరిగిందని కొత్త ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగ భద్రత లేకుండా వ్యవహరిస్తుందని ఆర్టీసీ కార్మికులు అనివార్యంగా సమ్మెకు వెళ్లే పరిస్థితి ప్రభుత్వం తీసుకు వచ్చిందని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సమస్యను పరిష్కరించాలని లేకుంటే కార్మికుల పక్షాన సిపిఎం సిఐటియు నిలబడుతుందని వారన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ బండారు శరత్ బాబు ఎస్ డబ్ల్యూ ఎఫ్ సిఐటియు నాయకులు ఎం వి ఎస్ నారాయణ. ఎన్ నాగరాజు ఎస్ అజయ్ కుమార్, రాయల రాములుప్రతాప్, ప్రసాద్, బాలు, బి ఎన్ రావు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపినారు









