కార్యక్రమం ఫేజ్ -1– మూడు రోజుల పాటు విజయవంతం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో: భద్రాచలం ఏప్రిల్ 21: టుడే 9 ప్రతినిధి
భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (జీడీసీ )లో నిర్వహించిన 2027 జనగణన శిక్షణ కార్యక్రమం మూడు రోజుల పాటు విజయవంతంగా, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. శిక్షణార్థుల చురుకైన పాల్గొనిక, క్రమశిక్షణ, నేర్చుకునే తపన ఈ కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. ప్రతి అంశాన్ని సులభంగా అర్థమయ్యే విధంగా, ప్రాయోగిక ఉదాహరణలతో బోధించిన తీరు శిక్షణను మరింత ప్రభావవంతంగా మార్చింది. ఈ సందర్భంగా శిక్షణ మాస్టర్లు ఆనంద్ శ్రీనివాస్ నరేష్ (ASO) అందించిన సమగ్ర మార్గదర్శకత్వం, స్పష్టమైన వివరణలు, నిరంతర ప్రోత్సాహం శిక్షణార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించాయి. టెక్నికల్ అసిస్టెంట్ నిఖిల్ అందించిన సాంకేతిక సహకారం కార్యక్రమం సజావుగా కొనసాగేందుకు ఎంతో తోడ్పాటును అందించటం జరిగింది.కాగా
శిక్షణలో భాగంగా నిర్వహించిన స్కిట్ రూపకల్పన అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి ఎలా సమగ్రంగా, ఖచ్చితంగా వివరాలు సేకరించాలో ప్రత్యక్షంగా ప్రదర్శించడం ద్వారా శిక్షణార్థులకు స్పష్టమైన అవగాహన కలిగింది. అదేవిధంగా మూడవ రోజు నిర్వహించిన ఫీల్డ్ ట్రిప్ ద్వారా ప్రాక్టికల్ అనుభవాన్ని అందించడం ఈ కార్యక్రమానికి మరింత విలువను చేకూర్చింది. ఈ శిక్షణ ద్వారా శిక్షణార్థులు మ్యాప్ డ్రాయింగ్‌తో పాటు, డేటా సేకరణ ప్రతిబింబనలో అవసరమైన నైపుణ్యాలను సమగ్రంగా అభివృద్ధి చేసుకున్నారు. మొత్తం శిక్షణ వాతావరణం అనుకూలంగా, ప్రేరణాత్మకంగా ఉండటం విశేషం.
కార్యక్రమం ముగింపు సందర్భంగా ఎమ్మార్వో ధనియాల వెంకటేశ్వర్లు శిక్షణ మాస్టర్లను ఘనంగా సన్మానించనున్నారు . ఈ సన్మానం కార్యక్రమానికి మరింత గౌరవాన్ని తీసుకురానున్నట్లు భావిస్తున్నారు మొత్తంగా ఈ మూడు రోజుల 2027 జనగణన శిక్షణ కార్యక్రమం భవిష్యత్తులో జరగనున్న జనగణన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు బలమైన పునాది వంటిది అని అనటం లో సందేహం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.









