ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు. ఐటీడీఏ పీవో బి రాహుల్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:దుమ్మగూడెం ఏప్రిల్ 18:
టుడే 9 ప్రతినిధి
చిన్నారులలో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రతిరోజు తీసుకునే ఆహారం స్థానంలో పోషకాలు మెండుగా ఉండే చిరుధాన్యాలు తీసుకోవడం వలన విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయని భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు. శనివారం నాడు దుమ్ముగూడెం మండలం నరసాపురం గ్రామంలోని రైతు వేదికలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జరిగిన పోషణ్ పోషణ పక్వాడ్ పోషణ అభియాన్ కార్యక్రమంలో ఐటిడిఏ పిఓ బి రాహుల్ తో పాటు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు , రక్తం వృద్ధి ఎదుగుదల, రోగ నిరోధక శక్తి పెరిగి జీవ క్రియ మెరుగుపరిచి శరీరం సమర్థవంతంగా పనిచేయడానికి తప్పనిసరిగా ఈ చిరుధాన్యాలు క్రమం తప్పకుండా ప్రతిరోజు అందించాలని, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నుండి ఆహారం తెచ్చి పిల్లలకు ఇవ్వకూడదని, ఇంటిలో సహజంగా చేసిన ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలని ఆయన అన్నారు. చిప్స్, కురుకురే వంటి జంక్ ఫుడ్స్ కు బదులు శనగలు, పప్పులు, పల్లీలు చిరుధాన్యాలతో తయారైన పాప కార్న్స్, పండ్లు ఆరోగ్యకరమైన స్నాక్స్ ను అందించాలని అన్నారు. పౌష్టికాహారంతో పాటు సరైన సమయానికి టీకాలను వైద్య సిబ్బందిచే చేయించాలని అన్నారు.

అనంతరం ఐటీడీఏ పీవో బి. రాహుల్ మాట్లాడుతూ బేటి పడావో బేటి బచావో అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించి గర్భిణీ స్త్రీలు పుట్టే బిడ్డ ఆడపిల్ల మగపిల్లల తెలుసుకోవడానికి ఎక్కువ శాతం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి స్కానింగ్లు చేయించి ఆడపిల్ల ఉంటే గర్భధారణ చేసుకుంటున్నారని అలా చేయడం చాలా నేరమని ఆడపిల్ల, మగ పిల్లవాడైన పుట్టిన ప్రతి బిడ్డకు ప్రభుత్వం ఎన్నో రకాల సౌకర్యాలు కల్పిస్తున్నదని అన్నారు. చిన్నారులకు ఎక్కువ శాతం వారికి సులభంగా అరిగే చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని తినిపించాలని, చక్కెర.తీపి పదార్థాలకు దూరంగా ఉంచాలని, అవి వాడడం వలన జ్ఞాపక శక్తి ఆలోచన వికాసం, చిన్నపిల్లలకు దెబ్బతింటాయని, చిన్నపిల్లలకు మొబైల్ ఇవ్వడం ద్వారా కంటిచూపు, మెదడు అభివృద్ధిపై చెడు ప్రభావం చూపుతోందని, ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం ఇవ్వడం వలన రోగ నిరోధక శక్తి పెరిగి మెదడు అభివృద్ధి చెందుతుందని, చిన్నపిల్లలను ఇంట్లో బయట ఆడుకునేందుకు వీలు కల్పించడం వలన శారీరక నైపుణ్యాలు మెరుగవుతాయని, తల్లిదండ్రులు ఎక్కువ సమయం చిన్న పిల్లలతో గడిపితే పిల్లల యొక్క మేధాశక్తి పెరిగి వారి అభివృద్ధికి ఎదుగుదలకు మార్గదర్శకులం అవుతామని అన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంతం నిర్వహించి, బేటి బడావో బేటి బచావో కిట్లు అలాగే నాలుగు సెక్టార్ల అంగనవాడి టీచర్లకు మొబైల్ ఫోన్లను అందించారు.

ఈ కార్యక్రమంలో డిడబ్ల్యువో స్వర్ణలత లేనినా, తాసిల్దార్ అశోక్ కుమార్, ఎంపీడీవో వివేక్, సిడిపిఓ జ్యోతి, మార్కెట్ కమిటీ చైర్మన్ తెల్లం సీతమ్మ, ఏపీఎం జగదీష్, మాజీ జెడ్పిటిసి సత్యనారాయణ, సర్పంచులు కుంజ కనకరత్నం, మట్ట వెంకటేశ్వర్లు, పోడియం సుబ్బారావు, కల్లూరి ఆదినారాయణ. వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలు తదితరులు పాల్గొన్నారు.









