30 లక్షల కనెక్షన్లకు 2 వేల మంది నిబ్బంది ఎలా సరిపోతారంటూ ఇంధన శాఖను నిలదీత…
కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న రైతు డిస్కమ్ పట్ల టీజీఈఆర్సీ పలు అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేసింది.రాష్ట్రంలో వ్యవసాయ కనెక్షన్లు, హైదరాబాద్ వాటర్ బోర్డ్, ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ కనెక్షన్లు కలిపి మొత్తం 30,34,032 కనెక్షన్లు ఉన్నాయని, వాటికి 2 వేల మంది సిబ్బంది ఎలా సరిపోతారని ప్రభుత్వాన్ని టీజీఈఆర్సీ ప్రశ్నించింది.
ఒక్కో మండలానికి దాదాపు 6వేల కనెక్షన్లు ఉండగా, కేవలం ఒక్క ఉద్యోగితో నిర్వహణ ఎలా సాధ్యం? అంటూ, విద్యుత్ వినియోగంలో 42% ఉన్న రైతు డిస్కమ్ వ్యవస్థలో ఉద్యోగులు కూడా అదే పరిమితిలో ఉండాలని పేర్కొంది.కాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ టీజీఈఆర్సీ లైసెన్స్ ఇవ్వకుండా రైతు డిస్కమ్ ఏర్పాటు ముందుకెళ్లడం సాధ్యం కాదు కనుక, ఈ డిస్కమ్ ఏర్పాటు మరింత ఆలస్యం అవనున్నట్లు సమాచారం









