సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది.తన శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫాం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరిట తీసుకున్న అప్పులు బండ్ల గణేష్ చెల్లించని కారణంగా జూబ్లీహిల్స్ లోని ఆస్తిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.8.50 కోట్లకు వేలం వేసింది బ్యాంకు వేలానికి వ్యతిరేకంగా బండ్ల గణేష్ వేసిన పిటిషన్‌పై అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన డెట్ రికవరీ ట్రిబ్యునల్ పై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్టును ఆశ్రయించగా,బండ్ల గణేష్‌కు అనుకూలంగా డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది.ఆస్తుల వేలం సరైన నిర్ణయమేనని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలంగాణ హైకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చింది.. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ భారత ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు బండ్ల గణేష్ ప్రకటించారు…
Post Views: 22









