ఎవరి స్థాయి. ఏం స్థాయి? స్థాయి పుట్టుకతో రాదు, చేసే పనితో వస్తుంది అంటూ ఒకింత ఆగ్రహానికి లోనైయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎప్పుడు తన పని తాను చేసుకుంటూ ఏ వివాదాలకు తావు లేకుండా నడుచుకునే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆగ్రహం రావటంతో అక్కడ ఉన్నవారు ఆశ్చర్యానికి లోనయ్యారు.
శుక్రవారం హైదరాబాదులో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాజీ సీఎం కేసీఆర్ స్థాయితో పోలుస్తూ ఓ విలేకరి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎవరి స్థాయి. ఏం స్థాయి? స్థాయి పుట్టుకతో రాదు, చేసే పనితో వస్తుంది. నీ స్థాయి ఏమిటి” అని మండిపడ్డారు. స్థాయి అనేది పోషించే పాత్రను బట్టి నడిచే నడవడికను అనుసరించి ఉంటుందని అన్నారు. విపక్ష నేతగా తాను ఎప్పుడూ అసెంబ్లీకి గైర్హాజరు కాలేదని స్పష్టం చేశారు.
తెలంగాణ అప్పులపై….మాజీ సీఎం కేసీఆర్ జవాబు చెప్పాల్సిందే అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పట్టుబట్టారు.పదేళ్ల పాలనలో రాష్ట్రంపై చేసిన అప్పులపై సమాధానం చెప్పాల్సింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే అని అన్నారు.
FRBM రుణాలు, ప్రభుత్వ హామీతో కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, డిస్కంలు తదితర సంస్థలకు పెండింగ్‌లు కలిపి రాష్ట్రంపై రూ.8,21,651 కోట్ల భారం మోపింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం.ఈ లెక్కలన్నీ అధికారిక రికార్డుల్లో ఉన్నాయి. అసెంబ్లీలో వైట్ పేపర్ సమర్పించి ప్రజల ముందుంచాం. వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నాల కంటే ప్రజలకు నిజాలు చెప్పే బాధ్యత గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ దేనని . స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం…









