భద్రాచలం ఏరియా హాస్పిటల్ లో పేషంట్ తరపు బంధువుల ఆందోళన…
(వినేష్) : భద్రాచలం :TODAY9 : ప్రతినిధి..
భద్రాచలం పట్టణానికి చెందిన గిరిజనుడు మడకం నాగేష్ (33) కు గత కొద్దిరోజుల క్రితం ప్రమాదం జరగగా అతను స్థానిక ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందాడు కాగా గాయాలకు కుట్లు వేసే సమయంలో వైద్యులు గాయంలో చిన్న రాయి ఉన్నట్టు గుర్తించకుండా కుట్లు వేశారని ఆరోపిస్తున్నాడు. కుట్లు వేసిన ప్రాంతంలో నొప్పి ఎక్కువగా వస్తుండటంతో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పటల్ లో సంప్రదించగా వారు స్కానింగ్ చేసి లోపల రాయి ఉన్నట్టు చెప్పారని వాపోయాడు. ఈ విషయమై డాక్టర్లను సంప్రదించగా సరైన సమాధానం చెప్పలేదని తెలియజేశాడు. పేషెంట్ తరపు బంధువులకు డాక్టర్లకు ఈ విషయంలో స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఇంత పెద్ద నిర్లక్ష్యంపై వివరణ కోరేందుకు వెళ్లిన తమపై డాక్టర్ దురుసుగా ప్రవర్తించారని వాపోయారు ,విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు హాస్పటల్ కు చేరుకొన్న తరువాత డాక్టర్స్ మళ్లీ చికిత్స చేస్తామని పేషెంట్ తరపున వారికి చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.. ప్రాణాలు పోయవలసిన డాక్టర్లు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అంటూ హాస్పిటల్ కి వచ్చిన రోగులు అభిప్రాయపడుతున్నారు.









