బి ఆర్ ఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జులై 2
టుడే 9 ప్రతినిధి యం. రామాచారి.
భద్రాచలం నియోజకవర్గం లో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొని న్యాయమైన ప్రతి ఓటును కాపాడాలని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్ పిలుపునిచ్చారు.
నియోజవర్గంలో ఉన్న 179 బూత్ లలో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని న్యాయమైన ఓటును కాపాడే కొరకు పనిచేయాలని రావులపల్లి పిలుపునిచ్చారు.

అనంతరం మానే రామకృష్ణ మాట్లాడుతూ రాబోయే కాలం అంతా గులాబీ జెండాదేనని కార్యకర్తలు కష్టపడ్డ ప్రతి ఒక్కరిని పార్టీ కాపాడుతుందని అన్నారు.
ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ప్రబోధ్ కుమార్, రేపాక పూర్ణచంద్రరావు, ఉడతా రమేష్, సునీల్ కుమార్, వార్డు మెంబర్ గోపి, గోసుల శ్రీనివాస్, కావూరి సీతామాలక్ష్మి, తెల్లం కామేశ్వరి, కణితి రాదా, ఎండి ముంతాజ్,పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.









