గురుకులాల అవినీతి ఆరోపణలపై చర్చకు రెడీ అయిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్…
గురుకులాల అవినీతి ఆరోపణలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ లు చర్చకు సిద్ధం అని ప్రకటించారు. ఈ దిశగా ఈ రోజు ఉదయం 9:45 గంటలకు ముగ్గురు మంత్రులు సీఎల్పీకి చేరుకున్నారు. మంత్రులు అక్కడి నుండి గన్ పార్క్ కి రానున్నారు ప్రస్తుతం శాసన సభ్యులుగా ఉన్న మాజీ మంత్రులు ఎవరు చర్చకు వచ్చిన తాము సిద్ధమన్న మంత్రులు..మాజీ మంత్రులు చర్చకు వస్తె సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ తేల్చి చెప్పారు.

ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ లు రానున్నారు.గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్లు తాము సిద్ధమన్ననేపథ్యంలో.గురుకులాల్లో అవినీతి జరిగిందని మంత్రుల సమక్షంలో నిరూపించేందుకు ప్రెస్ క్లబ్‌కు వెళ్లనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ లు వారితో తలపడేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గరకు రానున్నారు.









