సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమ పేలుడు జరిగి నేటితో సరిగ్గా ఏడాది అయినా ఆరని గాయం, బాదితులు ఆ బాధనుంచి ఇప్పటికీ తెరుకోలేక పోతున్నారు.2025 జూన్ 30న జరిగిన ఘోర ప్రమాదంలో 55 మంది కార్మికులు మృతి చెందిన విషయం తేలిసిందే.కాగా 8 మంది కార్మికుల అవశేషాలు ఇప్పటికీ పూర్తిగా లభించలేదు.మృతులను గుర్తించేందుకు అప్పట్లో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించటం కూడా జరిగింది.
ప్రమాదం జరిగిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రూ.1 కోటి పరిహారం ప్రకటించినా ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు అందింది రూ.45 లక్షలే,అయితే మిగిలిన పరిహారంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ప్రమాదానికి బాధ్యులు ఎవరో విచారణ కమిటీ ఇప్పటికీ తేల్చని కారణంగా భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలపై ఆరోపణలు వచ్చినా చర్యలు శూన్యం అనే మాటలు వినిపిస్తున్నాయి.ప్రమాదం లో 12 మంది కార్మికులు గాయపడగా ఇప్పటికీ ఆరోగ్య సమస్యలతోనే జీవనంసాగిస్తున్నారు.పూర్తి పరిహారం, బాధ్యులపై చర్యలు, న్యాయం కోసం బాధితుల నిరీక్షిస్తున్నారు.









