ఎన్నికల్లో రైతులను బ్రెయిన్ వాష్ చేసి తెలంగాణ స్థానిక పార్టీని పోగుట్టుకొనేలా చేశారు…

గత అసెంబ్లీ ఎన్నికల్లో రైతులను బ్రెయిన్ వాష్ చేసి తెలంగాణ స్థానిక పార్టీని పోగుట్టుకొనేలా చేశారు అంటూ పరోక్షంగా బిఆర్ ఎస్ పార్టీని సమర్థిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రొఫెసర్ కనకదుర్గ. తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఐక్యత ఇప్పుడెందుకు లేదు అని ప్రశ్నించారు . ఇప్పుడు తెలంగాణ కుక్కలు చింపిన విస్తరి అయిందని . తెలంగాణ వాళ్ళ ఐక్యత అయిపోయింది మనం తిష్ట వేయొచ్చు అne ధైర్యం ఆంధ్ర ప్రజలకు వచ్చింది అని అన్నారు.

వీళ్ళకి ఎంత ధైర్యం వచ్చింది అంటే వీధుల్లో బతుకమ్మ పాటలు పెట్టడం వల్ల చస్తున్నం అని కొందరు అంటున్నారని,వినలేకపోతే వెళ్ళిపొండి అని వాళ్లకు చెప్పానన్నారు.తెలంగాణ ఏర్పడటం వల్ల దేశ సమగ్రతకు నష్టం కలుగుతుందని కొందరు అంటున్నారని , బీజేపీనే 3 రాష్ట్రాలు చేసినపుడు లేని ప్రమాదం తెలంగాణ ఏర్పడటం వల్లనే ఎందుకొచ్చింది అని ప్రశ్నించారు.ఆంధ్ర ప్రజలను చూస్తే జాలి వేస్తుంది. ఆంధ్ర నాయకులు అక్కడ పాలన వదిలేసి ఇక్కడ రాజకీయాలు చేస్తామని వస్తున్నారని ఎద్దేవా చేశారు కనకదుర్గ.

ఆంధ్రలో వాళ్ళ నాయకుడిని ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళు నష్టపోతున్నా సరే సపోర్ట్ చేస్తారు. మనమేమో ఆబ్జెక్టివిటీ పేరిట బాగా పాలిస్తున్న నాయకుడిని, మంచి చేసిన నాయకుడిని తిడతాం అని వ్యాఖ్యానించారు. ఆంధ్రలో ఎక్కువ తెలంగాణ వాళ్ళు లేరు అక్కడి వాళ్ళతో కొట్లడటానికి, తెలంగాణ లో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మనని బలహీన పరచటానికి మన అనైక్యతే వాళ్ళ బలం అంటూ చెప్పుకొచ్చారు.

అది తెలుగు దేశం పార్టీ కాదు ఆంధ్ర దేశం పార్టీ. అది ఆంధ్రుల పార్టీ, తెలంగాణకు నష్టం చేసిన పార్టీ. నక్సలైట్ల పేరుతో యువతను చంపిన పార్టీ అదే. ఆ పార్టీ వల్లే గద్దర్ నష్టపోయాడు. అందుకే దానిని ఆంధ్ర దేశం పార్టీ అని పిలవాలి అని అన్నారు ప్రొఫెసర్ దంటు కనకదుర్గ.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share